తన కుటుంబ శ్రేయస్సు కోసం,
ప్రియురాలి కోసం ఎటువంటి అవరోధాలైనా ఎదుర్కొని పోరాడే ధైర్యవంతుడైన
యువకుడి కథే మా చిత్ర ఇతివృత్తం. స్వచ్ఛమైన ప్రేమకు అందమైన కుటుంబ
అనుబంధాల్ని మేళవించి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రమిది
అన్నారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్
కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో వైభవంగా
ప్రారంభమైంది. శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్
సమర్పణలో గణేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక.
బ్రదర్... బేసిక్‌గా లవ్‌లో వున్నవాళ్లకు పేషెన్స్ వుండాలంటారు.
దాంతో పాటు నాకు మెంటల్ కూడా వుంది. నా లవ్వు జోలికొచ్చినా...దాని నవ్వు జోలికొచ్చినా ఎవ్వడూ మిగలడు అని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్‌తో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. దీనికి కె. రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ అల్లుడు శీను చిత్రంతో మా అబ్బాయి శ్రీనివాస్‌కు పెద్ద విజయాన్నందించిన వి.వి.వినాయక్‌కు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి వుంటుంది.
అల్లుడు శీను విడుదలకు ముందే బోయపాటి శీను ఈ సినిమా చేస్తానని చెప్పారు. భద్ర తరహాలో కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. మా బ్యానర్‌లో మరో మంచి చిత్రమవుతుంది అన్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తీసే దర్శకుల్లో బోయపాటి ఒకరు.. ఆయన దర్శకత్వంలో శ్రీనివాస్ నటించడం అదృష్టంగా భావిస్తున్నానని వి.వి.వినాయక్ ఆనందం వ్యక్తం చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడం గొప్ప అనుభూతినిస్తోందని కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు. బోయపాటితో మూడు మ్యూజికల్ హిట్స్ సాధించానని, ఈ సినిమాతో మరో హిట్ ఇవ్వబోతున్నానని సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ చెప్పారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ నేను అనుకున్న కథకు శ్రీనివాస్ వందశాతం సరిపోయాడు. భద్ర తరహాలో వుండే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. కథ డిమాండ్ మేరకు భారీ బడ్జెట్ అవుతుంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించే కథానాయికను త్వరలో ప్రకటిస్తాం. నవంబర్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత యం. రత్నం, ఛాయాగ్రాహకుడు ఆర్ధర్ ఎ విల్సన్, సాయిగణేష్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment